Sri Ramakrishna Kathamrutam
Click to Listen to a Chapter
( Opens in a new window )
Listen more in AppListen more in AppShare
(Please search for the title if it doesn't open directly)

శ్రీ రామకృష్ణ కథామృతం

Sri Ramakrishna Kathamrutam

Mahendranath Gupta

అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీపకాలంలో అవతరించినవారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస. అసంఖ్యాకమైన వారి శిష్యులలో ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో కొన్నింటిని స్వీకరించి దానిని తమ జీవితం ద్వారానూ, రచనలు, ప్రసంగాల వంటి వివిధ మార్గాలద్వారానూ ప్రపంచానికి చాటారు. ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాథ్ గుప్త ఒకరు. వీరు కేవలం 'మ' గా ప్రసిద్ధులు. వీరు శ్రీ రామకృష్ణుల అమృత వాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొంది తద్వారా ప్రపంచ మాట చరిత్రలో ఎనలేని కీర్తినార్జించారు. 'మ' శ్రీరామకృష్ణులను 1882 ఫిబ్రవరిలో ప్రప్రధమంగా సందర్శించారు. ఆనాటి నుండి 1886 ఆగస్టులో శ్రీరామకృష్ణులు మహాసమాధి వరకూ దాదాపు 250 రోజులు ఆయన్ను దర్శించి, వారి అమృతవాక్కులను ఆలకించే భాగ్యం పొందారు. ఆ సంభాషణలను తమ దినచర్య పుస్తకంలో వ్రాసుకుని పదిలపరిచారు. ఆ తరువాత వాటిని 'శ్రీ శ్రీరామకృష్ణ కథామృత' పేరిట ఐదు సంపుటాలుగా వంగ భాషలో ప్రచురించారు. అనంతర కాలంలో ఇది మిగతా భారతీయ భాషలతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. క్లిష్టమైన తాత్త్విక సత్యాలు శ్రీరామకృష్ణులవద్ద సరళంగా మారడం ఒకవైపు, ఆయన చూపే దృష్టాంతాలు, ఉపమానాలు చెప్పే కథలు వాటిని సునాయాసంగా అర్ధం చేసుకునేలా చేసి మనస్సుకు హత్తుకునేట్టు చేయడం మరో వైపు ఈ గ్రంధంలో మనం చూస్తాం. జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరీక్షా సమయాలలో కథామృతంలోని ఒకటి రెండు అధ్యాయాలు చదివినపుడు ఎక్కడినుంచో అనిర్వచనీయమైన ఒక ఓదార్పు వచ్చి శోకతప్త హృదయాలను సేదదీర్చి ఆనందానుభూతులను కలిగించడం అసంఖ్యాక పాఠకుల అనుభవం. అందువల్ల ప్రతిరోజూ ఉదయం దినచర్యను ప్రారంభించే ముందూ, రాత్రి పడుకునే ముందూ కథామృతంలోని ఒకటి రెండు అధ్యాయాలు చదవటం అనేకులు ఒక అలవాటుగా కలిగి ఉన్నారు. ఆ గ్రంథరాజం ప్రప్రథమంగా ఇప్పుడు శ్రవణ రూపంలో. వినండి 'శ్రీ రామకృష్ణ కథామృతం' శ్రవణ పుస్తకం. గళం: కొండూరు తులసీదాస్ సమర్పణ : దాసుభాషితం.
Sri Sri Ramakrishna Kathamrita is a Bengali five-volume work by Mahendranath Gupta (1854–1932) which recounts conversations and activities of the 19th century Indian mystic Sri Ramakrishna. The Kathamrita is a regarded as a Bengali classic and revered among the followers as a sacred scripture. [Wikipedia] It has been translated into many languages including Telugu. In Telugu, it is brought out in 2 volumes in text format. For the benefit of Telugu followers of Sri Ramakrishna, Dasubhashitam is offering audio version of Kathamrutam. However, for technical convenience it is offered in 10 volumes of 50 chapters each.
Price in App
0
Chapters / Episodes
500
Rating
5.00
Duration
54:00:00
Year Released
2020
Presented by
Konduru Tulasidas
Publisher
Dasubhashitam
Language
Telugu